ఓట్ల తొలగింపులో అవకతవకలపై కాంగ్రెస్ భారీ ధర్నా

CEC వెంటనే రాజీనామా చేయాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): ఓట్ల తొలగింపు ప్రక్రియలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవకతవకలకు నిరసనగా మందమర్రి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం భారీ ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి పిలుపు మేరకు పట్టణంలోని పాత బస్టాండ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి ధర్నాలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరిపై...