పొన్నారం పాఠశాలల్లో సీఎం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్
హరే కృష్ణ ఫౌండేషన్ సహకారంతో విద్యార్థులకు అల్పాహారం పంపిణీ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): హరే కృష్ణ ఫౌండేషన్ సహకారంతో నిర్వహిస్తున్న సీఎం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమాన్ని పొన్నారం గ్రామపంచాయతీ పరిధిలోని జడ్పీహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో గురువారం గ్రామ సర్పంచ్ పెంచాల మధు ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. విద్యార్థులకు ఉదయం నాణ్యమైన అల్పాహారం, దుస్తులు, మధ్యాహ్న భోజనంలో...