హరే కృష్ణ ఫౌండేషన్ సహకారంతో విద్యార్థులకు అల్పాహారం పంపిణీ
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
హరే కృష్ణ ఫౌండేషన్ సహకారంతో నిర్వహిస్తున్న సీఎం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమాన్ని పొన్నారం గ్రామపంచాయతీ పరిధిలోని జడ్పీహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో గురువారం గ్రామ సర్పంచ్ పెంచాల మధు ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. విద్యార్థులకు ఉదయం నాణ్యమైన అల్పాహారం, దుస్తులు, మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం అందించడంతో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ పెంచాల అమృత రాజలింగు, వార్డు సభ్యుడు బోర్లకుంట్ల లక్ష్మణ్, ఉన్నత పాఠశాల హెచ్‌ఎం రాపిల్ రెడ్డి, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు సునీత, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గోగు సుమలత, కాంగ్రెస్ నాయకులు మాస్ సంతోష్, బేర సమ్మయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ ఈద లింగయ్యతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});