కవితక్క నిర్ణయంపై పెద్దపల్లి తెలంగాణ రక్షణ సేన నేతల హర్షం
కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి):
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
తెలంగాణ రక్షణ సేన రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీ పొన్నమనేని బాలాజీరావును పెద్దపల్లి నియోజకవర్గ తెలంగాణ రక్షణ సేన నాయకులు ఘనంగా సన్మానించారు. గురువారం మండల కేంద్రంలో పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బాలాజీరావుకు నాయకులు శాలువా కప్పి సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా సలేంద్ర కొమురయ్య యాదవ్ మాట్లాడుతూ, పొన్నమనేని బాలాజీరావును తెలంగాణ రక్షణ సేన రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం పట్ల పెద్దపల్లి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఆయన నియామకంతో పెద్దపల్లి నియోజకవర్గంలో తెలంగాణ రక్షణ సేనకు మరింత బలం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు బాలాజీరావు నాయకత్వం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాలాజీరావుకు బాధ్యతలు అప్పగించిన పార్టీ అధినాయకురాలు కవితక్కకు పెద్దపల్లి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});