CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 08 October 2026, 3:14 pm Posted By: coalbelt 24 News

బీబీపేటలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి

తెల్ల రేషన్ కార్డు కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించాలి
ముదిరాజ్ సంఘం జిల్లా కార్యదర్శి కొరివి నరసింహులు

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కామారెడ్డి జిల్లా ముదిరాజ్ సంఘం జిల్లా కార్యదర్శి కొరివి నరసింహులు డిమాండ్ చేశారు. గురువారం బీబీపేట మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ పేదల సొంతింటి కలను ప్రభుత్వం నెరవేర్చాల్సిన అవసరం ఉందన్నారు.

బీబీపేట గ్రామంలో ఇప్పటికీ అనేక పేద కుటుంబాలు రేకుల ఇళ్లు, గోనెపెంకులతో నిర్మించిన ఇళ్లలోనే జీవిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మండల కేంద్రంలో సుమారు 8 వేలకుపైగా జనాభా ఉన్నప్పటికీ, అర్హులైన పేదలకు ఆశించిన స్థాయిలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాకపోవడం బాధాకరమన్నారు. బీబీపేట గ్రామానికే కనీసం 200 ఇళ్లను మంజూరు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న పేదలకు ఇళ్ల నిర్మాణానికి సిమెంట్, ఇసుక, కంకర వంటి నిర్మాణ సామగ్రితో పాటు ఆర్థిక సహాయం అందించిన విధానాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం కూడా ఎలాంటి క్లిష్టమైన నిబంధనలు లేకుండా తెల్ల రేషన్ కార్డు ఉన్న అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తే పేదలకు ఎంతో మేలు జరుగుతుందని సూచించారు.

ప్రభుత్వం మారుమూల ప్రాంతాలైన బీబీపేట మండలంపై ప్రత్యేక దృష్టి సారించి, సొంత ఇల్లు లేని ప్రతి అర్హ కుటుంబాన్ని గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. ఇల్లు నిర్మించుకునే స్థోమత లేని పేదలకు అవసరమైన సహాయ సహకారాలు అందించడంతో పాటు, ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన సామగ్రి లేదా ఆర్థిక సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.  ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం వేగం పెంచాలని, పేదల సొంతింటి కలను త్వరితగతిన సాకారం చేయాలని కొరివి నరసింహులు కోరారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});