మందమర్రి యువకుడికి బంగారు పతకం
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మందమర్రి పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన మద్దెల ప్రశాంత్ విద్యా రంగంలో విశేష ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించారు. డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) నిర్వహించిన 27వ స్నాతకోత్సవంలో ఆయన ఈ అరుదైన ఘనతను అందుకున్నారు. హైదరాబాద్‌లోని డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రాంగణంలోని భవనం వెంకట్రామ్ ఆడిటోరియంలో నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా మద్దెల ప్రశాంత్ బంగారు పతకాన్ని అందుకున్నారు. బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్...