కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
మందమర్రి పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన మద్దెల ప్రశాంత్ విద్యా రంగంలో విశేష ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించారు. డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) నిర్వహించిన 27వ స్నాతకోత్సవంలో ఆయన ఈ అరుదైన ఘనతను అందుకున్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
హైదరాబాద్‌లోని డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రాంగణంలోని భవనం వెంకట్రామ్ ఆడిటోరియంలో నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా మద్దెల ప్రశాంత్ బంగారు పతకాన్ని అందుకున్నారు.
బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ (BLISc) కోర్సులోని అన్ని సబ్జెక్టులను ఒకేసారి పూర్తి చేయడంతో పాటు ప్రథమ శ్రేణిలో అత్యధిక మార్కులు సాధించినందుకు ఆయనకు ఈ బంగారు పతకం లభించింది. విద్యతో పాటు వృత్తిపరంగానూ రాణిస్తున్న ప్రశాంత్ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ శాఖలో గెజిటెడ్ అధికారి హోదాలో ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
విద్య, వృత్తి రంగాల్లో తన ప్రతిభను కొనసాగిస్తూ బంగారు పతకం సాధించిన మద్దెల ప్రశాంత్‌ను కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అభినందించారు. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});