ప్రజా సంక్షేమం, అభివృద్ధికి అందరూ సహకరించాలి

మంత్రి గడ్డం వివేకానంద కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): ప్రజా సంక్షేమం, గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలందరూ రాజకీయాలకు అతీతంగా సహకరించాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు–భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద కోరారు. బుధవారం మందమర్రి మండలం వెంకటాపూర్‌లో 33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సుమారు రూ.3 కోట్లతో నిర్మించనున్న సబ్‌స్టేషన్‌తో భవిష్యత్ విద్యుత్ అవసరాలు తీరనున్నాయని తెలిపారు. భూమి కేటాయింపుపై ఉన్న...