కాంట్రాక్ట్ కార్మికులకు 10 శాతం లాభాల వాటా ఇవ్వాలి
మంత్రి వివేక్‌కు ఐఎఫ్‌టీయూ వినతి కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): సింగరేణి ప్రైవేట్ కాంట్రాక్ట్ కార్మికులకు సంస్థ లాభాల్లో 10 శాతం వాటా కేటాయించాలని కోరుతూ సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఎస్‌సీసీడబ్ల్యూయూ–ఐఎఫ్‌టీయూ) ఆధ్వర్యంలో కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి వినతిపత్రం సమర్పించారు. బుధవారం మందమర్రి మార్కెట్ ఏరియాలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన మంత్రిని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డి. బ్రహ్మానందం ఆధ్వర్యంలో యూనియన్ నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డి. బ్రహ్మానందం...