CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 07 October 2026, 9:42 pm Posted By: coalbelt 24 News

కాంట్రాక్ట్ కార్మికులకు 10 శాతం లాభాల వాటా ఇవ్వాలి

మంత్రి వివేక్‌కు ఐఎఫ్‌టీయూ వినతి

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

సింగరేణి ప్రైవేట్ కాంట్రాక్ట్ కార్మికులకు సంస్థ లాభాల్లో 10 శాతం వాటా కేటాయించాలని కోరుతూ సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఎస్‌సీసీడబ్ల్యూ‌యూ–ఐఎఫ్‌టీయూ) ఆధ్వర్యంలో కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి వినతిపత్రం సమర్పించారు. బుధవారం మందమర్రి మార్కెట్ ఏరియాలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన మంత్రిని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డి. బ్రహ్మానందం ఆధ్వర్యంలో యూనియన్ నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా డి. బ్రహ్మానందం మాట్లాడుతూ.. సింగరేణి యాజమాన్యం 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వాస్తవ లాభాలను ఇప్పటివరకు ప్రకటించలేదని అన్నారు. తక్షణమే సంస్థకు వచ్చిన వాస్తవ లాభాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో పర్మనెంట్ కార్మికులతో సమానంగా కాంట్రాక్ట్ కార్మికులు కూడా విధులు నిర్వహిస్తున్నారని, సంస్థ లాభాల్లో వారి శ్రమ కూడా కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.

గతేడాది సింగరేణి లాభాల్లో పర్మనెంట్ కార్మికులకు 34 శాతం వాటా చెల్లించారని గుర్తుచేస్తూ.. కాంట్రాక్ట్ కార్మికులకు మాత్రం తక్కువ వేతనాలు చెల్లిస్తూ వారి శ్రమను వినియోగించుకుంటున్నారని విమర్శించారు. కాంట్రాక్ట్ కార్మికుల చెమట చుక్కలతోనే సింగరేణికి కోట్లాది రూపాయల లాభాలు వస్తున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో సింగరేణి లాభాల్లో కాంట్రాక్ట్ కార్మికులకు కూడా 10 శాతం వాటా కేటాయించేలా యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావాలని మంత్రి వివేక్ వెంకటస్వామిని కోరినట్లు బ్రహ్మానందం తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌సీసీడబ్ల్యూ‌యూ–ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ. వెంకన్న, బెల్లంపల్లి రీజియన్ అధ్యక్షుడు టి. శ్రీనివాస్, రీజియన్ నాయకులు రాయలింగు, భూమయ్య, కనకయ్య, గణేష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});