అమరులు కలలుగన్న సమాజ నిర్మాణమే వారికి నిజమైన నివాళి
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: అమరులు ఆకాంక్షించిన సమాజాన్ని నిర్మించడమే వారికి మనమిచ్చే నిజమైన నివాళి అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనుగుల గ్రామంలో మంగళవారం నిర్వహించిన ‘అమరుల యాది’ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సమాజంలోని సబ్బండ వర్గాలు, అన్ని కులాలకు అధికారంలో సముచిత భాగస్వామ్యం లభించినప్పుడే అమరుల త్యాగాలకు నిజమైన ఫలితం దక్కుతుందని పేర్కొన్నారు. సమాజం కోసం ఒక వ్యక్తి తన...