మందమర్రి ఏరియా బొగ్గు ఉత్పత్తి లక్ష్యంపై సమీక్ష సమావేశం
కోల్ బెల్ట్ న్యూస్ (మందమర్రి): మందమర్రి ఏరియాలో 2026-27, 2027-28 ఆర్థిక సంవత్సరాలకు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి, ఓవర్‌బర్డెన్ (ఓబీ) తొలగింపు, గనుల అభివృద్ధి లక్ష్యాల సాధనపై ఆన్యువల్ ప్లాన్ కమిటీ, టార్గెట్ కమిటీ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం మంగళవారం మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. కార్పొరేట్ కార్యాలయం నుంచి విచ్చేసిన కమిటీ సభ్యులు జనరల్ మేనేజర్లు దేవేందర్, నరసింహారావు, డీజీఎం గాబ్రియేల్‌రాజు, గని మేనేజర్ ప్రసాద్‌తో పాటు ఏడుగురు అసోసియేటెడ్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా...