మహాత్మ జ్యోతిబా ఫూలే విగ్రహ స్థలం వివాదంపై BC సంఘాల ఆవేదన

ఫూలే విగ్రహానికి కేటాయించిన స్థలంలో కాకా విగ్రహానికి భూమిపూజపై అభ్యంతరం ఇద్దరు మహనీయులకు వేర్వేరు స్థలాలు కేటాయించాలి బీసీ సంఘాల డిమాండ్‌ రేపు మీడియా సమావేశం కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మందమర్రి పట్టణంలోని పార్కు ముందు ఉన్న ఖాళీ స్థలంలో విగ్రహాల ఏర్పాటుపై వివాదం నెలకొంది. గతంలో మహాత్మ జ్యోతిబా ఫూలే విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ నిర్వహించి, స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చిన అధికారులు, అదే స్థలంలో తాజాగా స్వర్గీయ గడ్డం వెంకటస్వామి (కాకా) విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేయడంపై బీసీ సంఘాల నాయకులు...