రఘునాథ్ వెరబెల్లి, వెంకటేశ్వర్ గౌడ్‌పై ఆరోపణలు నిరూపించాలి..

కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్‌పై కొందరు వ్యక్తులు చేసిన వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. ఈ మేరకు సోమవారం మంచిర్యాల జిల్లా బీజేపీ కార్యాలయంలో హాజీపూర్ మండల అధ్యక్షుడు గడ్డం స్వామిరెడ్డి, మంచిర్యాల కార్పొరేషన్ గర్మిళ్ల జోన్ అధ్యక్షుడు అమిరిశెట్టి రాజ్‌కుమార్, నస్పూర్ జోన్ అధ్యక్షుడు కర్రె చక్రవర్తి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీజేపీ బలోపేతానికి నిరంతరం కృషి...