కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్‌పై కొందరు వ్యక్తులు చేసిన వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. ఈ మేరకు సోమవారం మంచిర్యాల జిల్లా బీజేపీ కార్యాలయంలో హాజీపూర్ మండల అధ్యక్షుడు గడ్డం స్వామిరెడ్డి, మంచిర్యాల కార్పొరేషన్ గర్మిళ్ల జోన్ అధ్యక్షుడు అమిరిశెట్టి రాజ్‌కుమార్, నస్పూర్ జోన్ అధ్యక్షుడు కర్రె చక్రవర్తి మీడియా సమావేశం నిర్వహించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీజేపీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న రఘునాథ్ వెరబెల్లిపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదన్నారు. పార్టీకి ప్రస్తుతం ఎలాంటి బాధ్యతలు లేని బొలిశెట్టి తిరుపతి, పార్టీ నుంచి సస్పెండ్ అయిన మడిపల్లి సత్యం చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
జాతీయ రహదారి అంశంపై స్పష్టీకరణ
జాతీయ రహదారి 63 విషయంలో రఘునాథ్ వెరబెల్లి ఎవరికి నష్టం కలగకుండా లక్షెట్టిపేట పట్టణం మీదుగా కాకుండా పట్టణానికి బైపాస్ రోడ్డు నిర్మించాలని కోరారని నాయకులు తెలిపారు. అయితే, రహదారి అలైన్‌మెంట్‌ను మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎక్కడా కోరలేదని స్పష్టం చేశారు. ఈ అంశంలో వ్యాపారుల నుంచి రఘునాథ్ డబ్బులు తీసుకున్నారంటూ చేసిన ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు. ఆరోపణలను నిరూపించకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గతంలో పార్టీ బాధ్యతలు అప్పగించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి
పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్న కార్యకర్తలను అవమానించేలా మాట్లాడటం తగదని నాయకులు అన్నారు. గతంలో బొలిశెట్టి తిరుపతికి హాజీపూర్ మండల అధ్యక్షుడిగా, మడిపల్లి సత్యంకు మండల ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన విషయాన్ని గుర్తు చేశారు. బొలిశెట్టి తిరుపతి కుమారుడికి గతంలో బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షుడిగా, ప్రస్తుతం యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా అవకాశం కల్పించడంలోనూ రఘునాథ్ వెరబెల్లి పాత్ర ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అమిరిశెట్టి రాజ్‌కుమార్, గడ్డం స్వామిరెడ్డి, కర్రె చక్రవర్తి, మధువరపు రమణరావు, బియ్యాల సతీష్‌రావు, హనుమండ్ల శ్రీనివాస్, కొట్టే ప్రశాంత్, మెరెడికొండ శ్రీనివాస్, రాజనర్సు, కొంకటి మహేందర్, ఇలవేణి సతీష్, సాగర్, చిందం తిరుపతి, బూర్ల అజయ్, కంపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});