బీజేపీ జిల్లా నాయకత్వంపై సీనియర్ నేతల తీవ్ర ఆరోపణలు

రఘునాథ్ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శలు జిల్లా అధ్యక్షుడిని బాధ్యతల నుంచి తప్పించాలని రాష్ట్ర నాయకత్వానికి విజ్ఞప్తి కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): భారతీయ జనతా పార్టీ మంచిర్యాల జిల్లా నాయకత్వంపై ఆ పార్టీ సీనియర్ నాయకులు బొలిశెట్టి తిరుపతి, జిల్లా కౌన్సిల్ సభ్యులు మడిపల్లి సత్యనారాయణ (సత్యం) తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. జిల్లా పార్టీలో ఎర్రబెల్లి రఘునాథ్ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని, ఆయనకు జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. జిల్లాలోని బెల్లంపల్లి, చెన్నూర్ నియోజకవర్గాల్లో పార్టీని నిర్వీర్యం...