CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 12:49 pm Posted By: coalbelt 24 News

తెలంగాణ రక్షణ సేనలో ములుగురి స్వప్న చేరిక

పెద్దపల్లి నియోజకవర్గంలో పార్టీకి మరింత బలం..
బీసీల హక్కులు, సామాజిక న్యాయం కోసం పోరాడాలి

కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

సీనియర్ జాగృతి నాయకురాలు ములుగురి స్వప్న తెలంగాణ రక్షణ సేనలో చేరారు. పెద్దపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ సలేంద్ర కొమురయ్య యాదవ్ ఆధ్వర్యంలో, పార్టీ అధ్యక్షురాలు కవిత సమక్షంలో ఆమె తన అనుచరులతో కలిసి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు, పార్టీ కుటుంబ సభ్యులు నూతనంగా పార్టీలో చేరిన ములుగురి స్వప్నతో పాటు ఆమె అనుచరులకు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం కూడా రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాలు, బీసీలు తమ హక్కులు, అవకాశాల కోసం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, బీసీల హక్కుల సాధన కోసం తెలంగాణ రక్షణ సేన నిరంతరం ప్రజల పక్షాన నిలుస్తుందని తెలిపారు.

పెద్దపల్లి నియోజకవర్గంలో తెలంగాణ రక్షణ సేనను గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం ప్రభుత్వంపై ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో తగిన ప్రాధాన్యం కల్పించేందుకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని సూచించారు.

ములుగురి స్వప్న చేరికతో పెద్దపల్లి నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలకు మరింత ఊపు వస్తుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తగా పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు తెలంగాణ రక్షణ సేన ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. తెలంగాణ ప్రజల హక్కుల పరిరక్షణ, బీసీల అభ్యున్నతి, సామాజిక న్యాయం కోసం పార్టీతో కలిసి సమష్టిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన నాయకులు, పెద్దపల్లి నియోజకవర్గ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ములుగురి స్వప్న అనుచరులు తదితరులు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});