CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 1:06 pm Posted By: coalbelt 24 News

అక్టోబర్‌ 6న వేములవాడకు కల్వకుంట్ల కవిత

రాజరాజేశ్వర స్వామి దర్శనం..
సనుగులలో అమరవీరుల స్మారక సభకు హాజరు 
టీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్దఎత్తున తరలిరావాలి
పెద్దపల్లి నియోజకవర్గం ఇంచార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ కొమురయ్య యాదవ్

కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి): 




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అక్టోబర్‌ 6న రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నట్లు పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకోనున్నారు. అనంతరం వేములవాడ నియోజకవర్గ పరిధిలోని సనుగుల గ్రామంలో నిర్వహించనున్న అమరవీరుల స్మారక సభలో పాల్గొననున్నట్లు ఆయన వెల్లడించారు.

కవిత పర్యటన నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కొమురయ్య యాదవ్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా కరీంనగర్‌, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల పరిధిలోని పార్టీ నాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనం అనంతరం సనుగులలో జరిగే అమరవీరుల స్మారక సభకు కవిత హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు, వారి కుటుంబాల సంక్షేమం, తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కొమురయ్య యాదవ్ అన్నారు. కవిత పర్యటన సందర్భంగా పార్టీ శ్రేణులు క్రమశిక్షణతో వ్యవహరించి, కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు సమిష్టిగా కృషి చేయాలని కోరారు. అదేవిధంగా కవిత పర్యటనకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు హాజరై తమ మద్దతు తెలియజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు, యువత, మహిళలు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు సనుగుల అమరవీరుల స్మారక సభలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});