‘బీసీ సీఎం’ నినాదం.. కాంగ్రెస్‌కు లాభమా? నష్టమా?
రేవంత్ నాయకత్వంలో ప్రభుత్వం దూకుడు పార్టీలో మాత్రం కొత్త చర్చకు తెర ముందుగా పార్టీ గెలుపా? లేక సీఎం కుర్చీపై పంచాయితీనా? కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ సమీకరణాలు మరోసారి ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనదైన రాజకీయ వ్యూహాలతో ప్రతిపక్ష బీఆర్ఎస్‌ను ఎదుర్కొంటూ.. ప్రభుత్వాన్ని దూకుడుగా ముందుకు తీసుకెళ్తున్న సమయంలో, సొంత పార్టీలో ‘బీసీ సీఎం’ నినాదం తెరపైకి రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు బలమైన నాయకత్వంగా రేవంత్‌రెడ్డి కొనసాగుతున్న వేళ.. ఇలాంటి నినాదాల...