కాంగ్రెస్ నాయకుడు బండి సదానందం కారు ప్రమాదం

స్వల్ప గాయాలతో బయటపడిన బండి సదానందం, కాంగ్రెస్ కార్యకర్తలు పరామర్శించిన మంత్రి, ఎంపీ కోల్ బెల్ట్ న్యూస్ (మందమర్రి): హైదరాబాద్‌లో స్వర్గీయ గడ్డం వెంకటస్వామి (కాక) జయంతి వేడుకల్లో పాల్గొని మందమర్రికి తిరిగి వస్తుండగా కాంగ్రెస్ నాయకుడు బండి సదానందం ప్రయాణిస్తున్న కారు కరీంనగర్ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాద సమయంలో కారులో బండి సదానందంతో పాటు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో వారందరికీ స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో...