స్వల్ప గాయాలతో బయటపడిన బండి సదానందం, కాంగ్రెస్ కార్యకర్తలు
పరామర్శించిన మంత్రి, ఎంపీ
కోల్ బెల్ట్ న్యూస్ (మందమర్రి):
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
హైదరాబాద్‌లో స్వర్గీయ గడ్డం వెంకటస్వామి (కాక) జయంతి వేడుకల్లో పాల్గొని మందమర్రికి తిరిగి వస్తుండగా కాంగ్రెస్ నాయకుడు బండి సదానందం ప్రయాణిస్తున్న కారు కరీంనగర్ సమీపంలో ప్రమాదానికి గురైంది.
ఈ ప్రమాద సమయంలో కారులో బండి సదానందంతో పాటు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో వారందరికీ స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో కొద్దిసేపు ఆందోళన నెలకొన్నప్పటికీ, ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు.
కారుకు ఎడమ వైపున మరొక గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతోనే ప్రమాదం జరిగినట్టు సమాచారం. ప్రమాదం విషయం తెలియగానే బండి సదానందం యాదవ్ ను మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీ ఫోన్ ద్వారా పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరుపై మంత్రికి బండి సదానందం వివరించారు. సదానందంతో పాటు కాంగ్రెస్ నాయకులు స్వల్ప గాయాలతో బయట పడటంతో మందమర్రిలో కాంగ్రెస్ నాయకులు ఊపిరి పీల్చుకున్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});