సింగరేణి హరిత ప్రస్థానంలో మరో వినూత్న అడుగు

మూసివేసిన కేకే-2 గని భూముల్లో తొలిసారిగా ఆయిల్‌పామ్ తోటల పెంపకం 2 హెక్టార్లలో 285 మొక్కల నాటిన మందమర్రి ఏరియా కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): బొగ్గు ఉత్పత్తితో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌ (SCCL) మరో వినూత్న హరిత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బొగ్గు తవ్వకాలు పూర్తయిన భూములను పునరుద్ధరించి, వాటిని పర్యావరణహితంగా, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయాలన్న సంస్థ లక్ష్యంలో భాగంగా మందమర్రి ఏరియాలోని మూసివేసిన కేకే-2 (KK2) భూగర్భ గని ఆవరణలో...