CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 3:14 pm Posted By: coalbelt 24 News

బీజేపీ నూతన రాష్ట్ర సంఘటన మంత్రికి ఘన సన్మానం

మర్యాదపూర్వకంగా కలిసిన మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

బీజేపీ తెలంగాణ రాష్ట్ర సంఘటన మంత్రిగా నూతనంగా నియమితులైన మధుకర్‌జీ తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీజేపీ మైనార్టీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ మధుకర్‌జీని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రజనీష్ జైన్ మధుకర్‌జీని శాలువాతో సత్కరించి, ఖడ్గాన్ని బహూకరించారు. పార్టీకి ఆయన అందించనున్న సేవలు, సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చేపట్టబోయే కార్యక్రమాలకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని ఈ సందర్భంగా రజనీష్ జైన్ పేర్కొన్నారు.

బీజేపీ సంస్థాగత నిర్మాణాన్ని గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు మరింత పటిష్టం చేయడంలో సంఘటన మంత్రిగా మధుకర్‌జీ కీలక పాత్ర పోషిస్తారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మైనార్టీ వర్గాల్లో పార్టీ సిద్ధాంతాలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు పార్టీకి ప్రజల్లో మరింత ఆదరణ పెంచేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

మధుకర్‌జీ నూతన బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో తెలంగాణలో పార్టీ కార్యక్రమాలకు మరింత వేగం వచ్చే అవకాశం ఉందని పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, రాబోయే కార్యక్రమాలు, నాయకులు–కార్యకర్తల సమన్వయం తదితర అంశాలపై పరస్పరం చర్చించినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మైనార్టీ మోర్చా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని నూతనంగా బాధ్యతలు చేపట్టిన సంఘటన మంత్రి మధుకర్‌జీకి శుభాకాంక్షలు తెలిపారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});