గురుపరంపర గొప్పతనాన్ని ప్రతిబింబించేలా ‘వందే గురుపరంపర’
రామకోటయ్య కళాసేవకు ఘన నివాళి కూచిపూడి నాట్య వైభవాన్ని చాటిన కళా ప్రదర్శనలు కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): ప్రముఖ నాట్యాచార్యులు భాగవతుల రామకోటయ్య సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన కుమారుడు, శిష్యుడు, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కూచిపూడి నాట్యగురువు భాగవతుల సేతురామ్ ఆధ్వర్యంలో ‘వందే గురుపరంపర’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 30న బుధవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగవతుల సాయిమోహిత్ రామ్ నిర్వహణలో భాగస్వామ్యమయ్యారు. గురుశిష్య పరంపర గొప్పతనాన్ని, కూచిపూడి నాట్య వైభవాన్ని ప్రతిబింబించేలా...