AITUCలో భారీగా చేరిన RK-5 గని కార్మికులు

104 మంది యువ కార్మికులు యూనియన్‌లో చేరిక కార్మికుల హక్కుల పరిరక్షణకు పోరాటం చేస్తామన్న నాయకులు కోల్ బెల్ట్ న్యూస్(శ్రీరాంపూర్): శ్రీరాంపూర్ ఏరియాలోని RK-5 గనిలో AITUC–SCWUకు కార్మికుల నుంచి భారీ స్పందన లభించింది. ఒకేసారి 104 మంది యువ కార్మికులు AITUC–SCWUలో సభ్యత్వం తీసుకున్నారు. శనివారం పిట్ సెక్రటరీ గునుగంటి నర్సింగరావు ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్ మీటింగ్‌లో యూనియన్ కార్మికులకు చేస్తున్న సేవలకు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో యువ కార్మికులు పాల్గొని యూనియన్‌లో చేరారు. ఈ సందర్భంగా AITUC అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య...