CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 3:52 pm Posted By: coalbelt 24 News

AITUCలో భారీగా చేరిన RK-5 గని కార్మికులు

104 మంది యువ కార్మికులు యూనియన్‌లో చేరిక
కార్మికుల హక్కుల పరిరక్షణకు పోరాటం చేస్తామన్న నాయకులు

కోల్ బెల్ట్ న్యూస్(శ్రీరాంపూర్):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

శ్రీరాంపూర్ ఏరియాలోని RK-5 గనిలో AITUC–SCWUకు కార్మికుల నుంచి భారీ స్పందన లభించింది. ఒకేసారి 104 మంది యువ కార్మికులు AITUC–SCWUలో సభ్యత్వం తీసుకున్నారు. శనివారం పిట్ సెక్రటరీ గునుగంటి నర్సింగరావు ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్ మీటింగ్‌లో యూనియన్ కార్మికులకు చేస్తున్న సేవలకు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో యువ కార్మికులు పాల్గొని యూనియన్‌లో చేరారు.

ఈ సందర్భంగా AITUC అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య యూనియన్ కార్యకర్తలను, కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతున్నామని స్పష్టం చేశారు.సేవ్ సింగరేణి జాతా, సింగరేణి హెడ్ ఆఫీస్ ముట్టడి, సమ్మె నోటీసు, ప్రధానమైన 24 అగ్రిమెంట్ల ఒప్పందం వంటి తదితర ఉద్యమాల్లో కార్మికుల సమస్యలపై పోరాటాలు నిర్వహించిన ఘనత AITUC కె దక్కిందన్నారు. 24 ప్రధాన డిమాండ్లపై కూడా కార్మికుల తరఫున ఉద్యమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. యువ కార్మికులు పెద్ద సంఖ్యలో AITUCలో చేరడం పట్ల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సింగరేణిలో భవిష్యత్‌లో యువ కార్మికుల పాత్ర కీలకమని, వారి సమస్యల పరిష్కారానికి మరింత బలంగా పోరాడుతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి సీతారామయ్య, తో పాటు AITUC నాయకులు డిప్యూటీ జనరల్ సెక్రటరీలు, కందికట్ల వీరభద్రయ్య, ముస్కె సుమయ్య, బ్రాంచ్ సెక్రటరీ బాజి సైదా, వైస్ ప్రెసిడెంట్ కొట్టే కిషన్ రావు, అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ మోత్కూరి కోమురయ్య తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు ఏరియా స్థాయి నాయకులు శ్రీనివాస్, ప్రవీణ్, మల్లేష్, జీపీ రావు, రాజకుమార్ ఉన్నారు.

యువ కార్మికుల ప్రధాన డిమాండ్లు…………

కార్మికుల హక్కుల పరిరక్షణకు నిరంతర పోరాటం
సింగరేణి భవిష్యత్‌లో యువ కార్మికులకు ప్రాధాన్యం
యువ కార్మికులకు న్యాయకత్వ అవకాశాలు కల్పించాలి
కొత్త గనులు, యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించాలి
కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు యూనియన్ పోరాటాలు కొనసాగించాలి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});