ప్రత్యేక నిధులు కేటాయించి జీవో నం.6 అమలు చేయాలి
ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నరసింహులు
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మహాసభ రాష్ట్ర పిలుపు మేరకు ముదిరాజ్‌ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నరసింహులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ముదిరాజ్‌ల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించి, జీవో నంబర్ 6ను వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రతి గ్రామంలో ముదిరాజ్‌లకు మూడు ఎకరాల భూమిని కేటాయించి, చేపల పెంపకం, పండ్లు, పలారాల ద్వారా జీవనోపాధి పొందేలా ప్రభుత్వం అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే గ్రామాల్లోని చెరువులు, కుంటలకు మరమ్మతులు చేపట్టి, వాటి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. కొన్ని గ్రామాల్లో ముదిరాజ్‌లు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ, బెస్తవాళ్లు ఉన్నారనే కారణంతో చెరువులు, కుంటల్లో ముదిరాజ్‌లకు సభ్యత్వం కల్పించడం లేదని ఆరోపించారు. చెరువులు, కుంటల్లో చేప పిల్లలను వదిలి వాటిపై ఆధారపడి జీవిస్తున్న ముదిరాజ్‌లపై ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని నరసింహులు అన్నారు. ముదిరాజ్‌లు ఏర్పాటు చేసుకున్న చెరువులు, కుంటల్లో చేపల పెంపకానికి ప్రభుత్వం అవసరమైన సహకారం అందించాలని కోరారు. గ్రామాల్లో ఎక్కడ చెరువులు, కుంటలు ఉన్నా ముదిరాజ్ సోదరులు ధైర్యంగా చేపల పెంపకం చేసుకుని జీవనోపాధి పొందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, ముదిరాజ్‌లకు న్యాయం చేయాలని కొరివి నరసింహులు డిమాండ్ చేశారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});