వచ్చే ఎన్నికల్లో పోటీపై అక్బరుద్దీన్ ఓవైసీ సందిగ్ధత
నేను ముసలోడినైపోయాను.. పోటీ చేయాలనే ఆలోచన లేదు ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు పొందిన ఎంఐఎం శాసనసభాపక్ష నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానో లేదో ఇప్పుడే చెప్పలేనని, ప్రస్తుతానికి ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన కూడా లేదని ఆయన పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన ఓ...