CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 5:20 pm Posted By: coalbelt 24 News

మంచిర్యాలలో గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా నివాళులు

కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

జిల్లా కేంద్రంలోని జనసేన పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసైనికులు ఇరువురు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ అహింసా మార్గంలో దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి అందించిన సేవలు, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి దేశ సేవా స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శప్రాయమని అన్నారు. దేశం కోసం వారు చూపిన మార్గం, చేసిన త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. వారి ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నల్లతీగల మహేష్, ఆవుల సాగర్, పిట్టల సుధాకర్, మేకల పవన్, అర్చనపల్లి చరణ్, ఎం.డి. మజీద్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});