CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 25 September 2026, 9:50 pm Posted By: coalbelt 24 News

యువతకు ఉచిత వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ

దరఖాస్తుల గడువు అక్టోబర్‌ 1 వరకు పొడిగింపు

డీజీఎం (పర్సనల్‌) సీహెచ్‌. అశోక్‌




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మందమర్రి, సెప్టెంబర్‌ 25 (కోల్‌ బెల్ట్‌ న్యూస్‌):

సింగరేణి సంస్థ మందమర్రి ఏరియా ఆధ్వర్యంలోని సింగరేణి సేవా సమితి ద్వారా మహిళలు, యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు పలు వృత్తి, విద్యా కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డీజీఎం (పర్సనల్‌) సీహెచ్‌. అశోక్‌ తెలిపారు. ఈ మేరకు శిక్షణ కోర్సులకు దరఖాస్తుల స్వీకరణ గడువును సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 1, 2026 వరకు పొడిగించినట్లు శుక్రవారం వెల్లడించారు.

మూడు నెలల కాలవ్యవధిలో టైలరింగ్‌, ఫ్యాషన్‌ డిజైనింగ్‌, బ్యూటీషియన్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా రెండు నెలల వ్యవధిలో కంప్యూటర్‌ డీటీపీ కోర్సులోనూ శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

వీరికి అర్హత….

గనుల కారణంగా భూములు కోల్పోయిన భూ నిర్వాసితుల భార్యలు, వారి పిల్లలు, మందమర్రి ఏరియా సింగరేణి కార్మికులు, మాజీ కార్మికుల భార్యలు, వారి పిల్లలు శిక్షణకు అర్హులని తెలిపారు. అలాగే కేకే ఓసీపీ, ఆర్కే ఓసీపీ ప్రాజెక్టుల పరిసర ప్రాంతాలతో పాటు బెల్లంపల్లి, కాసిపేట, సోమగూడెం, మందమర్రి, రామకృష్ణాపూర్‌ పరిసర గ్రామాల మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు.

ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను మందమర్రిలోని సింగరేణి జీఎం కార్యాలయంలో ఉన్న జీఎం పీఏ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ అక్టోబర్‌ 1, 2026 అని తెలిపారు.

మరిన్ని వివరాలకు: 7032878575 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

దరఖాస్తుకు జత చేయాల్సిన పత్రాలు

ఎస్‌ఎస్‌సీ మెమో

ఆధార్‌ కార్డు

పాస్‌పోర్ట్‌ సైజు ఫొటో

సింగరేణి ఉద్యోగి లేదా మాజీ కార్మికుల కుటుంబ సభ్యులైతే సంబంధిత ఐడెంటిటీ కార్డు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});