కార్మిక హక్కుల కోసం పోరాటాలకు సిద్ధం కావాలి

మందమర్రి, సెప్టెంబర్‌ 24: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కార్మిక హక్కుల పరిరక్షణకు నిరంతరం పోరాటాలు కొనసాగిస్తామని సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షుడు, వేజ్‌బోర్డు నాయకుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. గురువారం ఉదయం మందమర్రి ఏరియాలోని కేకే-5 గనిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్‌ మీటింగ్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత నెల 27న హైదరాబాద్‌లో ఆర్‌ఎల్‌సీ సమక్షంలో సింగరేణి యాజమాన్యంతో జరిగిన చర్చల్లో సమ్మె నోటీసులో పేర్కొన్న 32 డిమాండ్లలో 23 డిమాండ్లపై అంగీకారం...