లక్కీ డ్రా లబ్ధిదారులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు అందించాలి

దసరాకు ముందే పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌.. లేకుంటే నిరాహార దీక్షలు, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ముట్టడి బెల్లంపల్లి: లక్కీ డ్రాలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు వెంటనే పట్టాలు అందించి, ఇళ్లను అప్పగించాలని ఎంసీపీఐయూ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్‌ డిమాండ్‌ చేశారు. బెల్లంపల్లిలోని ఎంసీపీఐయూ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. లక్కీ డ్రాలో డబుల్‌ బెడ్‌రూం ఇల్లు వచ్చిందన్న ఆనందం లబ్ధిదారుల కళ్లలో కనిపించిందని, “ఈ దసరా పండుగను మన సొంతింట్లోనే జరుపుకుంటాం”...