క్రీడల్లోనూ సింగరేణి క్రీడాకారులు ప్రతిభ చాటాలి

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): బెల్లంపల్లి రీజియన్‌ పరిధిలోని మందమర్రి ఏరియా స్థాయి క్రీడాపోటీలను మంగళవారం సింగరేణి పాఠశాల ఆవరణలో ఉత్సాహంగా నిర్వహించారు. ఏరియాలోని సింగరేణి క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని వివిధ క్రీడల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు.ఏరియా స్థాయిలో పవర్‌ లిఫ్టింగ్, బాల్‌ బ్యాడ్మింటన్, వెయిట్‌ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించారు. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న క్రీడాకారులు ఆయా విభాగాల్లో పోటీపడి తమ నైపుణ్యాన్ని చాటుకున్నారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను తదుపరి కోల్‌ ఇండియా స్థాయి క్రీడాపోటీలకు ఎంపిక...