CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 8:32 pm Posted By: coalbelt 24 News

మందమర్రి మార్కెట్ వ్యాపారస్తుల ఆధ్వర్యంలో గణనాథుడికి ఘనంగా పూజలు

23న మందమర్రి మార్కెట్‌లో ఘనంగా గణనాథుని నిమజ్జనోత్సవం
భక్తిశ్రద్ధలతో తొమ్మిది రోజుల పూజలు
భారీగా తరలిరావాలని నిర్వాహకుల పిలుపు

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మందమర్రి మార్కెట్ వ్యాపారస్తుల ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక గణేష్ మండలి ఆధ్వర్యంలో గణనాథుని నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మార్కెట్ వ్యాపారస్తులు భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించిన మట్టి వినాయకుడు తొమ్మిది రోజులపాటు విశేష పూజలు, భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో భక్తుల పూజలందుకున్నారు.

విఘ్నాలను తొలగించి సకల శుభాలను ప్రసాదించే శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ నిత్య పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు గణనాథుని దర్శించుకుని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ నేపథ్యంలో బుధవారం, సెప్టెంబర్ 23న మధ్యాహ్నం 2 గంటలకు మందమర్రి మార్కెట్‌లోని అబ్రహం స్తూపం సమీపం నుంచి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి నిమజ్జన శోభాయాత్ర ప్రారంభం కానుంది. భక్తులు, వ్యాపారస్తులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథునికి ఘనంగా వీడ్కోలు పలకాలని నిర్వాహకులు కోరారు.

గణనాథుని నామస్మరణలు, భక్తి గీతాలు, మంగళ వాయిద్యాల నడుమ నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు తెలిపారు. నిమజ్జనోత్సవంలో ప్రతి ఒక్కరూ భక్తి భావంతో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});