బీబీపేట గణేష్ నిమజ్జనానికి మహంకాళి చెరువు వద్ద ఏర్పాట్లు
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): గణేష్ నిమజ్జనోత్సవాలను పురస్కరించుకుని బీబీపేట మండలంలోని మహంకాళి ఆలయం వద్ద గల పెద్ద చెరువు వద్ద స్థానిక పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టారు. ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది సమన్వయంతో నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. మహంకాళమ్మ ఆలయం నుంచి చెరువు నీటి వద్దకు వెళ్లే దారిని జేసీబీ సహాయంతో చదును చేసి నిమజ్జనానికి అనువుగా తీర్చిదిద్దారు. అదేవిధంగా రాత్రి వేళల్లో భక్తులకు దారి స్పష్టంగా కనిపించేలా పంచాయతీ సిబ్బంది సహకారంతో...