CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 5:12 pm Posted By: coalbelt 24 News

బీబీపేట గణేష్ నిమజ్జనానికి మహంకాళి చెరువు వద్ద ఏర్పాట్లు

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): 

గణేష్ నిమజ్జనోత్సవాలను పురస్కరించుకుని బీబీపేట మండలంలోని మహంకాళి ఆలయం వద్ద గల పెద్ద చెరువు వద్ద స్థానిక పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టారు. ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది సమన్వయంతో నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మహంకాళమ్మ ఆలయం నుంచి చెరువు నీటి వద్దకు వెళ్లే దారిని జేసీబీ సహాయంతో చదును చేసి నిమజ్జనానికి అనువుగా తీర్చిదిద్దారు. అదేవిధంగా రాత్రి వేళల్లో భక్తులకు దారి స్పష్టంగా కనిపించేలా పంచాయతీ సిబ్బంది సహకారంతో నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి వాటికి విద్యుత్ దీపాలను అమర్చారు. నిమజ్జన కార్యక్రమం సందర్భంగా భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఉపసర్పంచ్ చందుపట్ల ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జనోత్సవాల సందర్భంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. నిమజ్జనానికి వచ్చే భక్తులు పంచాయతీ సిబ్బందికి సహకరించాలని, ఏదైనా ఇబ్బంది ఎదురైతే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఉత్సవాల సందర్భంగా ఎవరూ ఇబ్బందులు పడకుండా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ ఉప్పల సాయినాథ్, వార్డు సభ్యులు అసిఫ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});