ఆదిలాబాద్ RIMS అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలి
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలి పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి): ఆదిలాబాద్ RIMSలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం, దట్టమైన పొగ కారణంగా చిన్నారులు మృత్యువాత పడిన ఘటన అత్యంత విషాదకరమని తెలంగాణ రక్షణ సేన నాయకుడు, BRS పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ అన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ నవజాత శిశువులు చికిత్స పొందుతున్న వార్డులో ఈ ఘటన చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమన్నారు. అగ్ని...