CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 6:16 pm Posted By: coalbelt 24 News

బాపూజీ సేవలు చిరస్మరణీయం

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

బాపూజీ 14వ వర్ధంతిని పురస్కరించుకుని బీబీపేట్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పద్మశాలి సంఘం బీబీపేట్ అధ్యక్షుడు అంకాలం నరేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కామారెడ్డి డివిజన్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు తుమ్మ మచ్చేందర్, హెచ్‌డబ్ల్యూసీఎస్ బీబీపేట్ చైర్మన్ అల్వాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ తుమ్మ రవీందర్ అతిథులుగా హాజరయ్యారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ సందర్భంగా బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కామారెడ్డి డివిజన్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు తుమ్మ మచ్చేందర్ మాట్లాడుతూ.. బాపూజీ జీవితాంతం సమాజ సేవకు అంకితమై పనిచేశారని కొనియాడారు. స్వాతంత్ర్య ఉద్యమంతో పాటు తెలంగాణ సాయుధ పోరాటం, ప్రత్యేక తెలంగాణ తొలి, మలి ఉద్యమాల్లో ఆయన పాల్గొన్నారని తెలిపారు.

బహుజనుల ఆశాజ్యోతిగా నిలిచిన బాపూజీ.. తన కుటుంబం కంటే సామాజిక సేవకే అధిక ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం తన మంత్రి పదవిని సైతం త్యాగం చేయడంతో పాటు తన ఆస్తులను కూడా సమాజం కోసం అందించారని పేర్కొన్నారు. వృద్ధాప్యం వరకు సమాజ సేవలో కొనసాగిన ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల పద్మశాలి సంఘం నాయకులు బాలే సహదేవ్, శివరాత్రి లక్ష్మీనారాయణ, చిలుక భాస్కర్, కారంపురి వేణు, సిరిగాధ బాల్‌రాజు, చందుపట్ల శ్రీహరి, చింతకింది వేణు, చింత లింగం, బింగీ పెంఠప్ప, బోడ శ్రీనివాస్, దుడుగు శ్రీనివాస్‌తో పాటు మల్కాపూర్, జనగామ, మాందాపూర్, బీబీపేట్ ప్రాంతాలకు చెందిన పద్మశాలి సంఘం సభ్యులు పాల్గొని బాపూజీకి నివాళులు అర్పించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});