CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 6:09 pm Posted By: coalbelt 24 News

మట్టి విగ్రహాల తయారీలో అక్షర యూత్‌ వినూత్న ప్రస్థానం

ఏడేళ్లుగా మట్టి వినాయకుల ప్రతిష్ఠ
అక్షర యూత్‌ స్ఫూర్తితో మట్టి వినాయకులను ప్రతిష్ఠించాలి
దశావతారాల రూపంలో మట్టి గణపతులు..
అక్షర యూత్‌కు మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ అభినందనలు

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మందమర్రి పట్టణంలో వినాయక చవితి నవరాత్రులను పురస్కరించుకొని అక్షర యూత్ సభ్యులు మట్టి విగ్రాలను మండపంలో ప్రతిష్టించి పూజలు చేస్తారు. అదే ఆనవాయితీని ఈ ఏడాది కూడా కొనసాగించడం విశేషం. ఈ విధంగా గత ఏడేళ్లుగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్న విషయం తెలిసి మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ సోమవారం గణపతిని సందర్శించి పూజలు చేసారు. అనంతరం యూత్ సభ్యులను అభినందించారు. ప్రతి సంవత్సరం దశావతారాల్లోని ఒక్కో అవతారాన్ని ప్రతిబింబించేలా గణపతి విగ్రహాలను ప్రత్యేకంగా రూపొందించి పూజించడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా అక్షర యూత్‌ సభ్యులు జిల్లా కలెక్టర్‌ను ఘనంగా సత్కరించారు. అనంతరం ఈ ఏడాది ఆదిశేషుని పడగలపై మహావిష్ణువు అవతారంలో రూపొందించిన గణపతి విగ్రహం చిత్రంతో కూడిన జ్ఞాపికను కలెక్టర్‌కు అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ.. …జిల్లాలోని ప్రతి ఒక్కరూ అక్షర యూత్‌ సభ్యులను ఆదర్శంగా తీసుకుని మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని సూచించారు. పర్యావరణహితమైన మట్టి వినాయకుల ప్రతిష్ఠను ప్రోత్సహిస్తూ అక్షర యూత్‌ సభ్యులు గత ఏడేళ్లుగా చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మందమర్రి మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాయలింగు, పూజారులు, భక్తులు పాల్గొన్నారు.

 

 

 

 




(adsbygoogle = window.adsbygoogle || []).push({});