కోస్గి సభకు పెద్దపల్లి నుంచి తరలివెళ్లిన టిఆర్ఎస్ శ్రేణులు

కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి): కోస్గిలో నేడు నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభకు పెద్దపల్లి నుంచి తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో సలేంద్ర కొమురయ్య యాదవ్ నాయకత్వంలో కార్యకర్తలు, నాయకులు సభకు బయలుదేరారు. తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, సామాజిక న్యాయం, ప్రజా హక్కుల సాధన తదితర అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, సమస్యల పరిష్కారం కోసం సమష్టిగా పోరాడాల్సిన అవసరాన్ని సభ ద్వారా చాటిచెప్పనున్నట్లు నాయకులు తెలిపారు. పాంచజన్య సంకల్ప సభను విజయవంతం...