రమ నర్సింగ్ దంపతులకు సన్మానం

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మంచిర్యాల జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు పైడిమల్ల రమ నర్సింగ్ దంపతులను సింగరేణి రిటైర్డ్ కార్మిక అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఆదివారం మందమర్రి మార్కెట్‌లోని సిద్ధి వినాయక మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వినాయక మండపంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రమ నర్సింగ్ దంపతులకు అసోసియేషన్ నాయకులు శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో సింగరేణి రిటైర్డ్ కార్మిక అసోసియేషన్ అధ్యక్షులు వాసాల శంకర్, సెక్రటరీ నెల్లి వీరన్న, ఉపాధ్యక్షులు జక్కం రాజన్న,...