కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
మంచిర్యాల జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు పైడిమల్ల రమ నర్సింగ్ దంపతులను సింగరేణి రిటైర్డ్ కార్మిక అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఆదివారం మందమర్రి మార్కెట్‌లోని సిద్ధి వినాయక మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వినాయక మండపంలో ఈ కార్యక్రమం జరిగింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ సందర్భంగా రమ నర్సింగ్ దంపతులకు అసోసియేషన్ నాయకులు శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో సింగరేణి రిటైర్డ్ కార్మిక అసోసియేషన్ అధ్యక్షులు వాసాల శంకర్, సెక్రటరీ నెల్లి వీరన్న, ఉపాధ్యక్షులు జక్కం రాజన్న, సహాయ కార్యదర్శి పోల్ సంపత్, ప్రచార కార్యదర్శి దాసరి ఎల్లారం, కోశాధికారి జెట్టి రవి, నాయకులు పానుగంటి రాజలింగు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుమల్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పుల్లూరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});