2 కిలోమీటర్ల మేర క్యూ.. దర్శనానికి నాలుగు గంటల సమయం
వృద్ధులు, చిన్నారులు రావొద్దని నిర్వాహకుల విజ్ఞప్తి
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఖైరతాబాద్ ప్రాంతం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉదయం నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో దర్శనం కోసం సుదీర్ఘ క్యూలైన్లు ఏర్పడ్డాయి.
మహాగణపతి దర్శనానికి ప్రస్తుతం సుమారు నాలుగు గంటల సమయం పడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు దాదాపు రెండు కిలోమీటర్ల మేర క్యూలో వేచి ఉన్నారు. ఆదివారం ఒక్కరోజే లక్ష మందికి పైగా భక్తులు బడా గణేశుడిని దర్శించుకునే అవకాశం ఉందని ఉత్సవ నిర్వాహకులు వెల్లడించారు.
భక్తుల రద్దీ నేపథ్యంలో దర్శనానికి వచ్చే వారు సహనం పాటించాలని, నిర్వాహకులు, పోలీసులు సూచించే మార్గదర్శకాలను అనుసరించాలని కోరారు. ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉన్నందున వృద్ధులు, చిన్నారులు మహాగణపతి దర్శనానికి రావొద్దని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉండగా, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఖైరతాబాద్ బడా గణేశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులతో ఏర్పాట్లపై వివరాలు తెలుసుకున్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});