బీబీపేటలో భారీ వర్షం.. రోడ్డుపై కూలిన చెట్లు
శ్రీగాధ బ్రిడ్జి వద్ద రాకపోకలకు అంతరాయం పోలీసుల చొరవతో వెంటనే తొలగింపు కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): మండలంలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి శ్రీగాధ బ్రిడ్జి సమీపంలో భారీ చెట్లు రోడ్డుపై కూలిపోవడంతో కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షం తీవ్రతకు చెట్లు నేలకొరిగి ప్రధాన రహదారిపై పడటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.చెట్లు రోడ్డుపై కూలిన విషయాన్ని స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. సమాచారం అందిన వెంటనే బీబీపేట పోలీస్ సిబ్బంది ఎం.ఏ. ఫైజ్, నవీన్ సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. పరిస్థితిని పరిశీలించిన...