108 రకాల ప్రసాదాలతో గణనాథుడికి ఘన నైవేద్యం

అంగరంగ వైభవంగా వినాయక నవరాత్రి వేడుకలు కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): జన్మభూమి నగర్‌లోని సృష్టి ఎంక్లేవ్ అపార్ట్మెంట్‌లో వినాయక నవరాత్రి వేడుకలు భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మహిళలు భక్తిశ్రద్ధలతో అందమైన ముగ్గులు వేశారు. అనంతరం 108 రకాల స్వీట్లు, 108 రకాల ప్రసాదాలతో స్వామివారికి ఘనంగా నైవేద్యం సమర్పించారు. వేద మంత్రోచ్చారణలు, భక్తుల ప్రార్థనలు, గణపతి నామస్మరణల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విఘ్నాలను తొలగించి సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం ప్రసాదించాలని...