వినాయక మండపాల్లో ప్లాస్టిక్‌కు స్వస్తి పలకాలి

ప్రకృతి పదార్థాల వినియోగంపై ‘ప్రకృతిమిత్ర’ అవగాహన కార్యక్రమాలు కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): వినాయక నవరాత్రులు కొనసాగుతున్న నేపథ్యంలో వినాయక మండపాల్లో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగాన్ని నివారించి, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ‘ప్రకృతిమిత్ర’ తెలంగాణ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం నస్పూర్‌ కలెక్టరేట్‌ రోడ్డులోని శ్రీ సిద్ధి వినాయక గణేష్‌ మండపం వద్ద ప్రకృతిమిత్ర సభ్యులు పర్యావరణహిత వస్తువులను ప్రదర్శించారు. ఆకు దొప్పలు, అరికే ఆకు పళ్లాలు, బట్ట సంచులు, జనపనార సంచులు, కాగితం సంచులు, స్టీల్‌...