విద్యార్థి నాయకత్వానికి ఎన్నికలతో బాటలు

మందమర్రి తెలంగాణ మెడల్ హైస్కూల్, ఇంటర్ కళాశాలలో ఎన్నికలు ఘనంగా ప్రమాణ స్వీకార వేడుకలు కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): పట్టణంలోని తెలంగాణ మెడల్ హైస్కూల్, ఇంటర్మీడియట్ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి విద్యార్థి నాయకుల ప్రమాణ స్వీకార వేడుకలను శనివారం పాఠశాల ప్రిన్సిపల్ సారా తస్నీం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుతమైన ప్రవర్తన, ప్రజాస్వామ్య విలువలను పెంపొందించే ఉద్దేశంతో భారత ఎన్నికల విధానాన్ని పోలిన రీతిలో విద్యార్థులకు నాయకత్వ ఎన్నికలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మందమర్రి పట్టణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్...