పోటీల్లో గెలుపోటముల కంటే భాగస్వామ్యమే ముఖ్యం
క్రీడా స్ఫూర్తితో రాణించి సింగరేణికి పేరు తీసుకురావాలి ఏఐటీయూసీ నేత సత్యనారాయణ, సివిల్ డీజీఎం భాష కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): పోటీల్లో గెలుపోటముల కంటే క్రీడాకారుల భాగస్వామ్యం, క్రీడా స్ఫూర్తి ముఖ్యమని ఏఐటీయూసీ మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, సివిల్ డీజీఎం భాష అన్నారు. శనివారం మందమర్రి సింగరేణి హైస్కూల్ గ్రౌండ్‌లో నిర్వహించిన మందమర్రి ఏరియా డిపార్ట్మెంటల్ అథ్లెటిక్స్ పోటీలకు వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గెలుపోటములు శాశ్వతం కావని, రాత్రి–పగలు మాదిరిగా మారుతూ ఉంటాయని...