క్రీడా స్ఫూర్తితో రాణించి సింగరేణికి పేరు తీసుకురావాలి
ఏఐటీయూసీ నేత సత్యనారాయణ, సివిల్ డీజీఎం భాష
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
పోటీల్లో గెలుపోటముల కంటే క్రీడాకారుల భాగస్వామ్యం, క్రీడా స్ఫూర్తి ముఖ్యమని ఏఐటీయూసీ మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, సివిల్ డీజీఎం భాష అన్నారు. శనివారం మందమర్రి సింగరేణి హైస్కూల్ గ్రౌండ్‌లో నిర్వహించిన మందమర్రి ఏరియా డిపార్ట్మెంటల్ అథ్లెటిక్స్ పోటీలకు వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గెలుపోటములు శాశ్వతం కావని, రాత్రి–పగలు మాదిరిగా మారుతూ ఉంటాయని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనడమే నిజమైన క్రీడా స్ఫూర్తికి నిదర్శనమన్నారు. ఓటమి నుంచి పట్టుదలను పెంచుకుని, గెలుపు కోసం సంకల్పబలంతో నిరంతరం కృషి చేయాలని క్రీడాకారులకు సూచించారు. ఏరియా స్థాయిలో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచి, అనంతరం కోల్ ఇండియా స్థాయి పోటీల్లో సింగరేణి ఏరియాకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు.
సింగరేణి కార్మికులు నిత్యం బొగ్గు గనుల్లో విధులు నిర్వహిస్తూ శారీరక, మానసిక అలసటకు గురవుతున్నారని సత్యనారాయణ అన్నారు. కార్మికుల మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని, సింగరేణి యాజమాన్యం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. కార్మికులు రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించేందుకు కృషి చేయాలని, ఉత్పత్తి కంటే రక్షణే ప్రథమం అని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జీఎం కార్యాలయ సీనియర్ పీఓ సురేందర్, జీఎం కార్యాలయం ఎఫ్‌ఏ సరిత, డబ్ల్యూపీఎస్‌జీఏ గౌరవ కార్యదర్శి కార్తీక్, ఏఐటీయూసీ ఆర్గనైజేషన్ కార్యదర్శి ఎగ్గేటి రాజేశ్వర్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శివ, జనరల్ కెప్టెన్ శ్రీనివాస్‌తో పాటు వివిధ గనులు, విభాగాల అధికారులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});