కొడంగల్‌లో కవిత సభ.. జనస్పందనపై ఆసక్తి

సీఎం సొంత నియోజకవర్గంలో ‘పాంచజన్య సంకల్ప సభ’ భారీగా జనసమీకరణకు తెలంగాణ రక్షణ సేన కసరత్తు కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 20న నిర్వహించనున్న ‘పాంచజన్య సంకల్ప సభ’కు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కొడంగల్‌ నియోజకవర్గంలోని కోస్గి జూనియర్‌ కళాశాల మైదానంలో మధ్యాహ్నం సభ నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెలంగాణ రక్షణ సేన నాయకులు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి...